ASI Son Gang Case: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఎస్ఐ వెంకట నాయుడు కుమారుడి గ్యాంగ్ కార్ల వ్యవహారంలో మరో కేసు నమోదు అయ్యింది. నర్సరావుపేట చోళ మండలం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ భరత్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోళ మండలం ఫైనాన్స్ కంపెనీలో కారు లోన్ తీసుకున్న ముగ్గురు కిస్తీలు చెల్లించకుండా ఆ కార్లను అమ్మారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Shambhala Trailer: ఆది సాయికుమార్ .. ‘శంబాల’ ట్రైలర్ రిలీజ్
అయితే, ఫైనాన్స్ ఉన్న కార్లను కొనుగోలు చేసిన వ్యక్తులు నకిలీ నెంబర్లు వేసి అమ్మినట్లు కంపెనీ మేనేజర్ భరత్ కుమార్ పేర్కొన్నారు. దీంతో నర్సరావుపేట వన్ టౌన్ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఆరుగురిలో ఏఎస్ఐ వెంకట నాయుడు కుమారుడి గ్యాంగ్ కు కార్లు ఇస్తున్న అంజీ, భానులు ఉన్నారు. వెంకట నాయుడు గ్యాంగ్ అమ్మిన కార్లలో కొన్నింటికి నకిలీ నెంబర్లు వెయ్యడంతో పాటు ఛాసిస్ నెంబర్లు ట్యాంపరింగ్ చేసినట్లు ఆర్టీఓ అధికారులు నిర్దారించారు.
