పల్నాడు ప్రాంతం పర్యాటకులతో పోటు ఎత్తుతుంది. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ద్వారా దిగువ ప్రాంతానికి భారీగా వరద నీరు వదలడంతో.. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. గడిచిన కొద్దీ రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు హాజరవుతున్నారు. నేడు ఆదివారం కావడంతో హైదరాబాద్ నుండి కూడా.. పెద్ద ఎత్తున పర్యాటకులు నాగార్జునసాగర్ సమీపంలోని సుందర జలపాతాలను సందర్శిస్తున్నారు.
Read Also: National Anthem: 14,000 గొంతులు ఒక్కసారిగా జనగణమన ఆలాపన.. గిన్నిస్ రికార్డు..
ముఖ్యంగా ఎత్తిపోతల జలపాతం చూసేందకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ఇక్కడ సహజ సిద్ధంగా 70 అడుగుల ఎత్తు ఉన్న కొండల మధ్య నుండి జాలు వారుతున్న జలపాతాల దృశ్యాన్ని చూస్తున్న పర్యటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లతో సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు తీసుకుంటూ కుటుంబాలు ఎంజాయ్ చేస్తున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం ఎత్తిపోతల జలపాతం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది పర్యాటకశాఖ. చిన్నారులకు జంపింగ్ నెట్స్తో పాటు ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేశారు.
Read Also: Vizag: విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్..
ప్రకృతి సోయగాల మధ్య జాలువారుతున్న కృష్ణమ్మ పరవల్లను చూసి.. సేదతీరుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులు. గడిచిన రెండు సంవత్సరాలు తర్వాత సాగర్ కు పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో పాటు.. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో జలపాతాలను వీక్షించేందుకు పల్నాడు ప్రాంతానికి తరలివస్తున్నారు.