Site icon NTV Telugu

Nadendla Manohar: పేదలకు భూములు ఇచ్చే పేరుతో తెనాలిలో భారీ స్కామ్ జరిగింది..

Nadendla

Nadendla

Nadendla Manohar: పేదల ఇళ్ల స్థలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ల్యాండ్ స్కాం.. తెనాలిలో జరిగిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కొంత మంది పేదల భూముల పేరుతో.. రైతులకు తక్కువ డబ్బు ఇచ్చి ప్రభుత్వం దగ్గర ఎక్కువ మొత్తాన్ని దోచేశారు అని చెప్పుకొచ్చారు. ఈ కుంభకోణంపై విజిలెన్స్ అధికారులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు.. విజిలెన్స్ నివేదికపై, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.

Read Also: Medchal Murder Case: మేడ్చల్‌ మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు..

ఇక, ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే తాను పాదయాత్ర ప్రారంభించానని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిజమైన పేదలకు, లబ్ధిదారులుగా స్థలాలు కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వెల్లడించారు. తమ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందనీ ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాలు క్రమంగా బయటకు వస్తున్నాయి.. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

 

Exit mobile version