Woman Assaulted in Train: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది.. ఓ వివాహితపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.. మాయమాటలు చెప్పి ఏసీ కూపేలోకి తీసుకెళ్లి మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి రైలులోనే అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు సంచలనం సృష్టించింది. రెంటచింతలకు చెందిన భార్యాభర్తలు జీవనంకోసం విశాఖపట్నం వెళ్లారు. అక్కడే ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెంటచింతల మండలం జెట్టిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భార్యాభర్తలు విశాఖ ఎక్స్‌ప్రెస్ లో ఆదివారం బయలుదేరారు.
Read Also: Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
అయితే, రైలు గుడివాడ-విజయవాడ మధ్యకు వచ్చిన సమయంలో ఏసీ బోగీలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి.. ఏసీ బోగీలో ఖాళీ ఉందని చెప్పి తీసుకెళ్లాడు.. భర్త ఏసీ బోగీలో టాయిలెట్ వద్ద కూర్చినొ ఉండగా.. భార్య హెచ్1ఏ బోగీలోని కూపేలోకి వెళ్లింది. గుర్తుతెలియని వ్యక్తి కూపే తలుపులు వేసి వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, నిందితుడు భయపెట్టాడో.. ఏం జరిగిందితో తెలియదు కానీ.. జరిగిన విషయాన్ని వెంటనే భర్తకు చెప్పిన భార్య.. నడికుడిలో ట్రైన్ దిగిన తర్వాత అసలు విషయం చెప్పింది. దీంతో రెంటచింతల చేరుకున్న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత ఫిర్యాదుతో జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన పోలీసులు సమాచారాన్ని విజయవాడ రైల్వే పోలీసులకు చేరవేశారు.
