ICICI Bank Fraud: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్లో గోల్ మాల్ పై అధికారుల చర్యలు చేపట్టారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ లోన్ ఖాతాదారుల అకౌంట్లలో డబ్బు, బంగారం మాయం అయినట్లు గుర్తించారు. మాయమైన సొమ్ము కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు బ్యాంక్ లో జరిగిన గోల్ మాల్ వ్యవహారం తెలియడంతో చిలకలూరిపేట బ్రాంచ్ కు ఉన్నత అధికారులు చేరుకున్నారు. ఇక, విషయం తెలిసిన ఖాతాదారులు బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు ముందు కస్టమార్లు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు.
Read Also: Top Headlines @5PM : టాప్ న్యూస్
తాము ఆర్థిక అవసరాల కోసం దాచుకున్న లక్షల సొమ్మును బ్యాంకు సిబ్బంది లూటీ చేసేసారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో అకౌంట్ నుంచి 25, 50, 75 లక్షలు రూపాయల ఫిక్స్ డిపాజిట్లు మాయం అయ్యాయి. ఫేక్ డిపాజిట్ బాండ్లను తయారు చేయించిన సిబ్బంది.. బంగారు రుణాల్లోనూ భారీగా గోల్ మాల్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కస్టమర్ 5 లక్షల రూపాయల రుణం తీసుకుంటే.. దానికి రెట్టింపు సొమ్మును ఖాతాదారుడి పేరుతో బ్యాంక్ సిబ్బంది లోన్ తీసుకోని మోసం చేసింది అన్నారు. బ్యాంక్ కుంభకోణం బయటపడటంతో ఇటు బ్యాంకు దగ్గరకు అటు పోలీస్ స్టేషన్ వద్దకు బ్యాంకు ఖాతాదారులు క్యూ కడుతున్నారు.