Site icon NTV Telugu

Yarapathineni Srinivasa Rao: జగన్ మళ్లీ సీఎం కాలేరు..! ఇంకా ఏం మిగిలిందని 2.0 చూపిస్తాడు..?

Yarapathineni Srinivasa Rao

Yarapathineni Srinivasa Rao

Yarapathineni Srinivasa Rao: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై హాట్‌ కామెంట్లు చేశారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. వైఎస్‌ జగన్ మళ్లీ సీఎం అవ్వలేరన్న ఆయన.. ఇంకా ఏం మిగిలిందని జగన్‌ 2.0 చూపిస్తాడు..? అని ప్రశ్నించారు.. ఇక, కడపలో జరిగిన మహానాడును‌ కనీవినీ ఎరుగని రీతిలో నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేశారన్నారు. అయితే, వై నాట్ 175 అన్నారు.. 151 నుంచి 11 పడిపోయారని ఎద్దేవా చేశారు.. గతంలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలన్నీ బయటికు వస్తున్నాయి. జగన్ మళ్లీ సీఎం కాలేరు.. ఇక ఏం మిగిలిందని 2.0 చూపిస్తాడు అని నిలదీశారు.. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం తెలుసుకోవడానికి ఆరు నెలలు పట్టిందన్నారు..

Read Also: Minister Parthasarathy: క్యాడర్‌ జాగ్రత్త..! కొందరు కోవర్టులు టీడీపీలో చేరుతున్నారు..

మరోవైపు, తంగెడలో ఎన్నికల్లో దాడిచేసిన వ్యక్తి పోలీసులు తీసుకొచ్చి విచారణ చేస్తే వైసీపీ నాయకులు పోలీసుల మీద గొడవకు దిగారని తెలిపారు యరపతినేని.. అసలు, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు.. కానీ, నరసరావుపేటలో ఆయన కాంప్లెక్స్ మాత్రం పూర్తయ్యిందన్నారు.. నియోజకవర్గానికి చెందిన కొంతమంది వైసీపీ కార్యకర్తలను వైఎస్‌ జగన్ వద్దకు తీసుకువెళ్లి మా మీద దాడులు చేశారని చూపెడుతున్నారని ఫైర్‌ అయ్యారు.. నేను కూడా మీ జగన్ కి ఇక్కడ మీ కార్యకర్తలు ఏ విధంగా దాడులు చేస్తున్నారో లెటర్ రూపంలో తెలియజేస్తాను అన్నారు.. వైసీపీ కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా.. మీ నాయకుల మాటలు విని గొడవలకు వెళ్లవద్దని సూచించారు.. వాళ్ల పబ్బం కోసం మిమ్మల్ని గొడవలకి ప్రేరేపించి గొడవలు సృష్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.

Exit mobile version