Site icon NTV Telugu

Melioidosis Disease: పల్నాడులో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం..

Palnadu

Palnadu

Melioidosis Disease: పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్‌ వ్యాధి కలకలం రేపుతుంది. వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా.. మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో రోగి దామావత్ హర్యానాయక్ కు అధికారులు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే దావుపల్లి తండాకు వెళ్లిన పల్నాడు డీఎంహెచ్ఓ వెళ్లి, ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

Read Also: ఐశ్వర్య మీనన్ అందం అదుర్స్: తెలుగు ఫ్యాన్స్‌కి గిఫ్ట్ !

ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి రవి మాట్లాడుతూ.. మెలియాయిడోసిస్ అంటూ వ్యాధి కాదని తెలియజేశారు. గ్రామంలోని ప్రజలు భయపడొద్దని సూచించారు. అయితే, ఇప్పటికే గుంటూరు జిల్లా తురకపాలెంను మెలియాయిడోసిస్ వ్యాధి వణికించిన విషయం అందరికి తెలిసిందే. గుంటూరు జీజీహెచ్‌లోని చికిత్స పొందుతున్న తురకపాలెనికి చెందిన ఆరుగురిలో ఒకరికి మెలియాయిడోసిస్‌ వ్యాధి పాజిటివ్‌గా తేలింది. ఇక, 46 ఏళ్ల ఆ వ్యక్తి మోకాలిలోని ద్రవాన్ని తీసుకుని టెస్టులకి పంపించగా ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది.

Exit mobile version