Macherla: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌కు షాకిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మున్సిపల్ చైర్మన్ పదవి నుండి తురఖా కిషోర్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.. ఏపీ మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్ 16(1)(కె )ను ఉల్లంఘించినందుకు తురఖా కిషోర్‌ను మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. 15 కౌన్సిల్ మీటింగులకు ఆయన హజరుకాలేదని తేలడంతో పదవినుండి తొలగించినట్టు వెల్లడించింది.. ప్రస్తుతం పోలీసుల అదుపులో తురకా కిషోర్ ఉన్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్.. ఛైర్మన్ అధికారాలను దుర్వినియోగం చేసిన కేసులో చర్య ఎందుకు తీసుకోకూడదని ఇప్పటికే కిషోర్ కు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం.. కానీ, ఆ నోటీసులకు ఎలాంటి సమాధానం కిషోర్ నుంచి రాలేదు.. దీంతో, మాచర్ల మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న తురఖా కిషోర్‌ను పదవి నుండి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఏపీ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్..
Read Also:
