Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్‌.. మరో కేసు నమోదు..

Ambati

Ambati

Ambati Rambabu New Case: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మళ్లీ షాక్‌ తగిలింది.. మాజీ మంత్రిపై మరో కేసు నమోదు అయింది. తన ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే కాగా.. ఈ సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా దీక్ష నిర్వహించారని ఆరోపిస్తూ నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రజా ప్రదేశంలో దీక్ష చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా, నిరాహార దీక్ష కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Read Also: VDxShouryuv : జూనియర్ ఎన్టీఆర్ కథతో విజయ్ దేవరకొండ సినిమా

కాగా, ఇటీవల తన నివాసంపై జరిగిన దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు దీక్ష చేపట్టగా, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు నమోదు చేసిన కేసుపై ఆయన స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఇప్పటికే సత్తెనపల్లి లక్కీడ్రా కేసుతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసుల్లో అరెస్ట్‌ అయిన అంబటి రాంబాబు 17 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్‌పై విడుదలైన విషయం విదితమే..