NTV Telugu Site icon

Pallam Raju: కష్టకాలంలో కాంగ్రెస్‌ను వీడొద్దు.. వారికి ఇదే నా విజ్ఞప్తి..!

Pallam Raju

Pallam Raju

కష్టకాలంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీని వీడొద్దు అంటూ పార్టీ సినియర్ నేతలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు.. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్‌ నేతగా ఉన్న గులాంనబీ ఆజాద్ పార్టీని వీడడం దురదృష్టకరం అన్నారు.. ఆజాద్ సహనం పాటించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కష్టకాలంలో కాంగ్రెస్‌ పార్టీని సీనియర్లు వీడకూడాదని విజ్ఞప్తి చేసిన ఆయన.. పార్టీన బలపర్చడానికి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని గుర్తుచేశారు.. ఇక, సీబీఐ, ఈడీలను ఉపయోగించి భారతీయ జనతా పార్టీ.. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేప్రయత్నం చేయడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసం రాజీనామ చేశారని ఆరోపించి… ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు పల్లం రాజు..

Read Also: Vaishnav Tej : ‘రంగ రంగ వైభవంగా’కు యూఏ సర్టిఫికెట్‌..

కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. కొన్ని సందర్భాల్లో పార్టీ అధిష్టానం, పీసీసీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.. తాజాగా, పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.. మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆజాద్.. తాజాగా పార్టీని వీడారు.. బీజేపీలో మాత్రం చేరేది లేదని స్పష్టం చేసిన ఆయన.. కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే..