కోవిడ్ రోగుల చికిత్సలో ఆక్సిజన్ పాత్ర చాలా కీలకమైనది.. ఆక్సిజన్ సరైన సమయం అందక.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు వదిలారు.. అయితే, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్ అయ్యింది.. దీంతో.. కోవిడ్ పేషెంట్ల ప్రాణాలు రిస్క్‌లు పడ్డాయి.. మరోవైపు ఆక్సిజన్ లీకేజీని అరికట్టడానికి ఆస్పత్రి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. దాదాపు గంటన్నర నుంచి అదుపులోకి రావడం లేదని చెబుతున్నారు.. ఇక, ఈ పరిస్థితి స్వయంగా సమీక్షిస్తున్నారు పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్ హిమన్సు శుక్ల.. కోవిడ్ పేషెంట్లను అవసరమైతే ఆశ్రం ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ లను సిద్ధం చేశారు అధికారులు.. ఇప్పటికే దేశంలో ఆక్సిజన్ లీకై పెద్ద సంఖ్యలో కోవిడ్ రోగులు మృతిచెందిన ఘటనలు మరువక ముందే.. ఇప్పుడు ఏపీలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్.. రిస్క్‌లో కోవిడ్ బాధితులు..!
Oxygen leak