NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: మా ఫోన్లపై నిఘా పెట్టారు..

Kakani

Kakani

Kakani Govardhan Reddy: సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు చంద్రమోహన్ రెడ్డి 3 లక్షల రూపాయల డిమాండ్ చేశారని బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారు.. తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పినా.. సోమిరెడ్డి కనికరించలేదని ఆరోపణలు చేశారు. అది మేము చేయించినట్లు ఆరోపించగా.. నగదు చేతులు మారాయని అందువల్లే విమర్శలు చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.. మాకు ఆయనకు సంబంధం లేదు అని కాకాణి చెప్పుకొచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది.. మా ఫోన్లపై నిఘా పెట్టారు.. నేను పెంచలయ్యతో మాట్లాడానేమో చూసుకోండి అని కాకాణీ గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Drugs Mafia: హైదరాబాదులో మరొకసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఏకంగా 8.5 కిలోల ఆంఫేటమైన్ డ్రగ్స్..

ఇక, తాను నిజాయితీపరుడినని సోమిరెడ్డి నిరూపించుకోవాలి అని కాకాణీ గోవర్థన్ రెడ్డి అన్నారు. పెంచలయ్య ఆరోపణలపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.. ఆయన వీడియోను ఫార్వర్డ్ చేసినందుకు నాపై A2గా కేసు పెట్టారు.. పోలీసు కేసులకు భయపడం.. సోమిరెడ్డి అవినీతికి పాల్పడినా మాట్లాడకూడదా.. సోమిరెడ్డిపై ఇతరులు చేసిన ఆరోపణలను ఫార్వర్డ్ చేయడం తప్పా అంటూ ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం.. అధికారంలో లేనప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం సోమిరెడ్డి నైజం.. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, అంగన్వాడి, ఔట్ సోర్సింగ్, ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు ఉద్యోగుల బదిలీలకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని మాజీ మంత్రి కాకాణీ అన్నారు.

Read Also: Ukrain Attack : రష్యాలో 9/11 తరహా దాడి.. సరతోవ్‌లోని ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన డ్రోన్

అలాగే, ఏపీ జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ బూడిదకు సంబంధించిన బల్కర్ల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారు అని మాజీమంత్రి కాకాణీ గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో లే- అవుట్ యజమానుల నుంచి మామూళ్ళు తీసుకున్నారు.. అప్పట్లో వాళ్లందరూ నా బినామీలు అన్నారు.. లే- అవుట్ లన్నీ ధ్వంసం చేశారు.. ఇప్పుడు డబ్బులు తీసుకొని వాటికి అనుమతులు ఇస్తున్నారు.. ఇప్పుడు ఏమీ చేయలేక కేసులు పెడుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. కేసులకు భయపడితే రాజకీయాల్లో ఉండగలమా.. సోమిరెడ్డి చేసే అవినీతి పనులకు సంబంధించి ఒక రికార్డును విడుదల చేస్తాం.. ఇరిగేషన్ పనులను పరిశీలించడం కాంటాక్టర్లను బెదిరించి.. మామూళ్లు వసూలు చేయడం సోమిరెడ్డికి అలవాటుగా మారింది.. ఎస్ఎన్జే డిస్టీలరీస్ నుంచి నేను మామూళ్లు తీసుకున్నానని సోమిరెడ్డి ఆరోపించారు.. దమ్ముంటే నిరూపించాలి.. నేను చెప్పిన అంశాలపై విచారణ చేస్తే ఎవరు దోషి అనే విషయం తేలుతుంది అని కాకాణీ గోవర్థన్ రెడ్డి వెల్లడించారు.