Site icon NTV Telugu

Atchannaidu : జగన్‌కు ఆస్కార్‌ కాదు.. మోసకార్‌ ఇవ్వాల్సిందే..

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షులు నాయకులు అచ్చెన్నాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆస్కార్‌ అవార్డకు మించి నటించారని ఆయన అన్నారు. జగన్‌రెడ్డికి మోసకార్‌ అవార్డు ఇవ్వాల్సిందేనని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ లోపాయికారితనం, చేతకానితనం మరోసారి బహిర్గతమైందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. సీఎం, వైసీపీ ఎంపీలు వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి నేటి వరకు ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు నిత్యం ఏదో ఒక సమస్యపై విచారం వ్యక్తం చేస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. సమస్యలపై గళమెత్తిన వారిని వైసీపీ ప్రభుత్వం అనిచివేస్తోందని ఆయన అన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై విముఖత ఏర్పడుతోందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నిక్లలో ప్రజలే వైసీపీకి బుద్దిచెబుతారని ఆయన అన్నారు.

Exit mobile version