Site icon NTV Telugu

గోదావరి ఉద్ధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari

Godavari

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం.. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. గోదావరి పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేశారు.. ఇక, అత్యవసర సేవల కోసం కంట్రోల్‌ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.. ఇటు, దేవీపట్నం మండలంలోని 33 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఎగువ కాపర్‌ డ్యామ్‌పై గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. గండిపోచమ్మ ఆలయం వద్దకు చేరుకుంది వరదనీరు.. భద్రాచలం దగ్గర నిన్న 20 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం ఈ ఉదయానికి 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక, ప్రతి గంటకూ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బాధితులు సహాయం కోసం 93929 19743 నంబరుకు ఫొటోలు వాట్సాఫ్‌ చేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా.. అత్యవసర సేవల కోసం కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 08744 241950, 08743 23244 సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.

Exit mobile version