ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూతులకు ఇవాళ మాక్ పోలింగ్, రీ చెకింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ రీ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘానికి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దరఖాస్తు చేశారు. టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రక్రియ ప్రకారం మాక్ పోలింగ్, రీ చెకింగ్ చేసేందుకు ఈసీ సిద్ధమైంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాల డేటాతో వీవీ ప్యాట్ స్లిప్పులు సరిచేయాలే తప్ప మాక్ పోలింగ్, రీ చెకింగ్ అవసరం లేదని ఏపీ హైకోర్టును బాలినేని ఆశ్రయించారు.
Read Also: T20 World Cup 2025: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. వెస్టిండీస్‌తో భారత్ తొలి మ్యాచ్!
కాగా, ఇవాళ ఉదయం 10:40 గంటలకు ఏపీ హైకోర్టులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి రిట్ కేసు హియరింగ్ కు రానుంది. ఉన్నత న్యాయస్థానం ఏం ఆదేశాలు ఇస్తుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు యధావిధిగా కొనసాగనున్న ఎన్నికల సంఘం టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్.. కాగా, ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు. అయితే, ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరా నిఘాలో నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
