NTV Telugu Site icon

October 15: ఏపీలో వేడిని రాజేస్తున్న అక్టోబర్ 15… ఏం జరగనుంది?

Oct15ap

Oct15ap

ఏపీలో మూడురాజధానుల రచ్చ కొనసాగుతూనే వుంది. అమరావతి ముద్దు-మూడురాజధానులు వద్దని విపక్షాలు గొంతెత్తి నినదిస్తున్నాయి. ఇటు అధికార పార్టీ మాత్రం మూడురాజధానుల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు డైలాగ్ లు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వేడిని పుట్టిస్తుంది అక్టోబర్-15. వైసీపీ, టీడీపీ,జనసేన ఫోకస్ అంతా విశాఖ పైనే వుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. వికేంద్రీకరణ కోసం విశాఖ గర్జన నిర్వహిస్తున్న నాన్ పొలిటికల్ జె.ఏ.సీ పైనే అందరి ఫోకస్ పడింది.

Read Also: Aqua Ex India 2022: ఫిషరీస్ యూనివర్శిటీకి 28న జగన్ శంకుస్థాపన

విశాఖ గర్జనకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది అధికార వైసీపీ. 50వేల మందితో భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తోంది. ఎల్.ఐ.సీ సర్కిల్ నుంచి బీచ్ రోడ్ వరకు సుమారు 4.5.కిలోమీటర్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ప్రభుత్వం వైఫల్యాలపై విస్త్రత సమావేశంకు సిద్ధమైంది విపక్ష టీడీపీ. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకత్వం విశాఖ తీరానికి రానుంది. ఈనెల 15 నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన కూడా వుంది. జనవాణి , పార్టీ సమీక్ష కోసం విశాఖకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ పై మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలతో ఇప్పటికే హాట్ హాట్ గా మారింది విశాఖ రాజకీయం. మంత్రికి వ్యతిరేకంగా పోస్టర్లు వేసింది జనసేన. ఇటు అధికార పార్టీ నేతలు కూడా విశాఖ రాజధాని విషయంలో రాజీలేదంటున్నారు. విపక్షాలు, అమరావతి పాదయాత్రపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు.

Read Also: PM Narendra Modi: నాలుగో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి అమర్‌ నాథ్ పవన్ పై విరుచుకుపడ్డారు. దత్త తండ్రి @ncbn తరఫున.. దత్త పుత్రుడి @PawanKalyan మియావ్ మియావ్…!మియావ్.. మియావ్ దత్తపుత్రుడి @PawanKalyan త్రీ క్యాపిటల్స్:1-అంతర్జాతీయ రాజధాని మాస్కో, 2-జాతీయ రాజధాని ముంబాయి, 3-పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటూ వ్యంగ్యంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జనసేన నేతలు మంత్రిని టార్గెట్ చేశారు.