NTV Telugu Site icon

Occult Worship: క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తికి దేహశుద్ది.. పోలీసులు ఎంట్రీతో..

Occult Worship

Occult Worship

Occult Worship: టెక్నాలజీ ఎంత పెరిగినా ఇంకా మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. ఈజీ మనీకోసం అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. క్షుద్రపూల పేరుతో హడావిడి చేస్తున్నారు. దేవాలయాలు, పురాతన భవనాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. మరి కొందరు క్షుద్రపూజలతో ప్రాణాలు చేసేందుకు పూనుకుంటున్నారని కొందరు వాపోతున్నారు. పొలాల్లో, గ్రామాల్లో, ఇలాంటి క్షుద్రపూజలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లు ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని జీవించే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో జరిగింది.

Read also: Amit Shah tour in Telangana: మరోసారి మోడీ టూర్​​ క్యాన్సిల్​.. 11న అమిత్‌ షా పర్యటన

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామంలోని ఒక వ్యక్తి అందరితో మంచిగానే ఉంటు కొద్ది రోజులుగా పూజలు నిర్వహిస్తున్నాడని గ్రామస్తులు గమనించినా అంతలా పట్టించుకోలేదు. అయితే రాను రాను అంతను చేస్తున్నది క్షుద్రపూజలు అని తెలియగానే ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఏం చేస్తే అతన్ని వారిపై కక్షగట్టి ఏమైనా చేస్తాడేమో అని భయపడ్డారు గ్రామస్తులు. అయితే ఇలాగే వదిలేస్తే ప్రాణాలపై ముప్పు వస్తుందని తెగించిన గ్రామస్తులు అందరూ ఏకమయ్యారు. అతను క్షుద్రపూజలు చేస్తున్న చోటుకు వెళ్లి నిలదీశాడు. అయితే అతను నేను చేస్తున్నది క్షుద్రపూజలే అని చెప్పడంతో..ఆగ్రహానికి గురైనా గ్రామస్థులు అతనిపై దాడి చేశారు. అతన్ని కట్టేసి దేహశుద్ది చేశారు. అతడు ఎందుకు క్షుద్రపూజలు చేస్తున్నారు అనేది అతన్ని విచారిస్తున్నారు. అయితే ఈఘటన అటు ఇటు వెళ్లి మీడియా ప్రతినిధులకు, పోలీసుల వరకు వెళ్లింది. అయితే మీడియా రామాపురం గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలోకి మీడియాకు అనుమతించలేదు గ్రామస్థులు. వారిని గ్రామం బయటే అడ్డుకున్నారు. అయితే పోలీసులను ఎంట్రీ అయ్యేందుకు కూడా ముందు అనుమతి లేదన్న గ్రామస్తులు చివరికి పోలీసులు వారిని నచ్చచెప్పడంతో గ్రామంలోకి అనుమతి ఇచ్చారు. చెటుకు కట్టేసి దేహశుద్ది చేసిన నిందితున్ని విచారణ చేపట్టారు. అయితే అతను గ్రామస్థుడేనా? లేక వేరే ప్రాంతం నుంచి వచ్చి గ్రామంలో ఇలా క్షుద్రపూజలు చేస్తున్నాడా? లేక ఎవరిపైనా అయినా టార్గెట్‌ చేసి ఇలా క్షుద్రపూజలకు పాల్పడ్డాడా? అనే విషయంపై అరాతీస్తున్నారు పోలీసులు దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా టెక్నాలజీ పెరుగుతున్న ప్రజల్లో ఇలాంటి మూఢనమ్మకాలు పాతుకుపోవడంపై తీవ్ర ఉత్కంఠంగా మారింది.
Drugs: సబ్బుల్లో మత్తుపదార్థాలు.. 33.6 కోట్ల విలువైన కొకైన్ సీజ్‌

Show comments