Site icon NTV Telugu

టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఎల్లుండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారని కేటీఆర్ అన్నారు.. 

https://ntvtelugu.com/ktr-tweeted-to-modi/
22.

2.ప్ర‌పంచంలో విస్తీర్ణం ప‌రంగా అతిపెద్ద దేశాల్లో ర‌ష్యాకూడా ఒక‌టి. కావాల్సినంత స్థ‌లం ఉన్న‌ది. వ‌న‌రులు ఉన్నాయి. అన్ని ర‌కాల సౌక‌ర్యాలు ఉన్న‌ప్ప‌టికీ ర‌ష్యా ప్ర‌స్తుతం తీవ్ర‌మైన సంక్షోభంలో నెల‌కొన్న‌ది. సోవియ‌ట్ యూనియ‌న్ విచ్ఛిన్నం త‌రువాత ర‌ష్యాలో జ‌నాభ క్ర‌మంగా త‌గ్గిపోతూ వ‌స్తున్న‌ది. 1990 త‌రువాత జ‌నాభా మ‌రింత త‌గ్గిపోవ‌డం ప్రారంభ‌మైంది. అయితే, క‌రోనా కార‌ణంగా ఆ దేశంలో మ‌ర‌ణాల సంఖ్య భారీగా న‌మోదైంది.

https://ntvtelugu.com/russia-needs-to-increase-population-in-future/

3.గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. గంజాయి సాగు చేస్తున్న రైతుల, పండిస్తున్న భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులచే ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో గంజాయి రవాణా చేస్తున్న వారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న సాగుచేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి బైండోవర్….

https://ntvtelugu.com/minister-srinivas-held-a-meeting-with-officials-on-the-drug-issue/

4.టీడీపీ నాయకుల మీద కంట్రోల్‌ లేదని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. 14 ఏళ్ల చిన్న పాప లైంగిక వేధింపులకు గురైందని, మేడ మీద నుంచే దూకే ముందు అటు ఇటు తిరిగింగిందని వాసిరెడ్డ పద్మ ఆరోపించారు. ఆ బాలిక మరణం తప్ప గత్యంతరం లేదని దూకి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. దీనికి కారణమైన వినోద్‌ జైన్‌ ను సస్పెండ్‌ చేస్తే సరిపోతుందా అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వినోద్ జైన్ ఎలాంటి వాడో బెజవాడ అందరికీ తెలుసునన్నారు.

https://ntvtelugu.com/vasireddypadma-criticized-tdp/

5.ఒక‌వైపు అమెరికాను క‌రోనాతో పాటు మ‌రో స‌మ‌స్య వ‌ణికిస్తున్న‌ది. గ‌త కొన్నిరోజులుగా అమెరికాలోని అనేక ప్రాంతాల్లో మంచుతుఫాను కురుస్తున్న‌ది. మంచుతోపాటు వేగంగా గాలులు వీస్తుండ‌టంతో ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారిపోయాయి. దీనిని నార్ ఈస్ట‌ర్ అని పిలుస్తారు. ఈ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారి పీడ‌నం ప‌డిపోతే మంచు గ‌ట్ట‌లు గుట్ట‌లుగా ప‌డిపోతుంది. 

https://ntvtelugu.com/bomb-cyclone-tension-in-usa/

6.వినోద్ జైన్ ను సస్పెండ్ చేసి టీడీపీ చేతులు దులుపుకుంటోందని.. చిన్నారి ఆత్మహత్య ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీ నేత వినోద్ జైన్ చిన్నారిని ఇబ్బంది పెట్టాడని.. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విధంగా కఠినంగా వ్యవహరించాడని…. 54 ఏళ్ల వ్యక్తికి ఈ బుద్ది ఎలా వచ్చిందో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. వినోద్ కుమార్ జైన్ను కఠినంగా శిక్షిస్తామని.. అందరూ బాధపడుతోన్నారని మంత్రి పేర్కొన్నారు.

https://ntvtelugu.com/vellampalli-criticized-tdp-and-chandrababu/

7.టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఎమ్మెల్సీ పదవీకాలం గడువు త్వరలోనే ముగుస్తుందని.. అందుకే లోకేష్ తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత లోకేష్‌కు ఏ పదవీ వచ్చేది లేదనే విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడంటూ లోకేష్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

https://ntvtelugu.com/ycp-mp-vijayasaireddy-slams-nara-lokesh-about-his-mlc-position/
8.

8.కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీ “జేమ్స్” విడుదలకు సిద్ధమవుతోంది. పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు పునీత్ లేకపోవడంతో ఆయన పాత్ర డబ్బింగ్ విషయం ఆసక్తికరంగా మారింది. పునీత్ డబ్బింగ్ మినహా సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. పునీత్‌కి డబ్బింగ్ చెప్పడానికి తగిన వాయిస్‌ కోసం మేకర్స్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. చివరకు పునీత్ అన్నయ్య శివరాజ్‌కుమార్‌తో డబ్బింగ్ చెప్పించడానికి మొగ్గు చూపారు.

https://ntvtelugu.com/emotionally-difficult-to-dub-for-puneeth-rajkumar-says-sivaraj-kumar/

9.హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఎందుకంటే ఈ హైవేను సూపర్ ఇన్ఫర్‌మేషన్ రహదారిగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్-బెంగళూరు హైవే సూపర్ హైవేగా వాహనదారులకు సేవలు అందించనుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఒకవేళ మీరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. ఆ ప్రాంతం నుంచి బయటపడేందుకు ఎంత సమయం పడుతుంది?

https://ntvtelugu.com/hyderabad-bangalore-super-highway-soon/
10.

10.ఒక్కొక్క‌రిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించిన‌పుడు వారు వెలుగులోకి వ‌స్తుంటారు. కొంత‌మంది ఇనుప ముక్క‌ల‌ను, గాజు ముక్క‌ల‌ను తిని రికార్డ్ సాధిస్తుంటారు. అయితే, ఇరాన్‌కు చెందిన అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్య‌క్తి అంద‌రికంటే భిన్నంగా త‌న నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. త‌న శ‌రీరంపై 85 స్పూన్ల‌ను బ్యాలెన్స్ చేస్తూ రికార్డ్ సాధించాడు. మామూలుగా శ‌రీరంపై స్పూన్ల‌ను పేర్చి అవి కింద‌ప‌డ‌కుండా బ్యాలెన్స్ చేయాలంటే సాధ్య‌ప‌డే ప‌నికాదు. కానీ, అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్య‌క్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. 

https://ntvtelugu.com/man-creates-guinness-book-record-by-balancing-spoons-on-his-body/
Exit mobile version