Site icon NTV Telugu

టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆయా దేశాలు ఆంక్ష‌లు స‌డ‌లిస్తూ వ‌స్తున్నాయి.. ఈ నేప‌థ్యంలో.. భార‌తీయుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కెనడా స‌ర్కార్.. భార‌త్ నుంచి నేరుగానైనా లేదా గల్ఫ్‌/యూరప్‌/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తూ నిర్ణ‌యం తీసుకుంది కెన‌డా.. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన త‌ర్వాత క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా చాలా దేశాలు ఆంక్ష‌ల బాట‌ప‌ట్టాయి.

https://ntvtelugu.com/canada-relaxes-testing-rules-for-indian-travellers/

2.ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వినిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల జిల్లాల పేర్ల విషయంలో కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలకు వంగవీటి రంగ, భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాలనే డిమాండ్లు రాగా.. తాజాగా ఓ జిల్లాకు దివంగత దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని ఆయన అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది.

https://ntvtelugu.com/anr-fans-new-demand-for-andhra-pradesh-districts-division/

3.శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో మచ్చింతల్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఉత్సవాలకు అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చకచక జరిగిపోయాయి. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే చిన్న జీయర్‌ స్వామి స్వయంగా ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను సైతం పంచారు

https://ntvtelugu.com/sri-ramanuja-millennium-celebrations/

4.దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే ఇజ్రాయెల్‌తో భారత ప్రభుత్వం డీల్ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్‌ను 200 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయనాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్‌తో నిఘా పెట్టాయన్న కథనాలు గత ఏడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణలతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

https://ntvtelugu.com/ndia-purchased-pegasus-in-2017-said-that-newyork-times/

5.మనం అందరమూ భూమి బిడ్డలమే, కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ బాధ్యత నెరవేర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ లో మొక్కలు నాటారు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి.

https://ntvtelugu.com/femina-miss-india-world-manasa-participate-green-india-challenge/

6.ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఆర్సీపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది.

https://ntvtelugu.com/ap-govt-implement-esma-on-employees/

7.2030 త‌రువాత మ‌నిషి ఎలాగైనా మార్స్ మీద‌కు వెళ్లాల‌ని, అక్క‌డ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాల‌ని చూస్తున్నాడు. దానికోస‌మే కోస‌మే మార్స్‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. మ‌నిషి ఆవాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా నీరు కావాలి నీరు ఉంటేనే అక్క‌డ మాన‌వ ఆవాసం సాధ్యం అవుతుంది. మార్స్‌పై నీటి జాడ‌లు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు నాసా ప్ర‌యోగాలు చేస్తున్న‌ది. ప్ర‌స్తుతం అంగార‌కుడిపై పరిశోధ‌న‌లు చేస్తున్న మార్స్ రిక‌న‌సెన్స్ ఆర్బిటార్ కీల‌క విష‌యాల‌ను తెలియ‌జేసింది.

https://ntvtelugu.com/nasa-mro-finds-water-flowed-on-mars-longer-than-previously-thought/

8.తెలంగాణలో భూముల ఆస్తుల విలువను పెంచుతూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలను ఖరారు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం భూమి రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను ఏకంగా రూ.24.22 కోట్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

https://ntvtelugu.com/land-costs-are-increased-in-hyderabad/

9.త్వరలో ఇండియాలో వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను వెస్టిండీస్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్, కోల్‌కతాలలోనే జరగనున్నాయి. అయితే ఈసారి టీమిండియా క్రికెటర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో విమాన కంపెనీల నుంచి స్పందన రాకపోవడంతో ఈసారి క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని బీసీసీఐ చెప్తోంది.

https://ntvtelugu.com/for-west-indies-tour-no-charter-flights-for-indian-players/

10.త్వరలో ఇండియాలో వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను వెస్టిండీస్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్, కోల్‌కతాలలోనే జరగనున్నాయి. అయితే ఈసారి టీమిండియా క్రికెటర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది. 

https://ntvtelugu.com/for-west-indies-tour-no-charter-flights-for-indian-players/
Exit mobile version