Site icon NTV Telugu

టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.గోదావరి యాజమాన్య బోర్డు సబ్‌ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. బోర్డు మెంబర్, సెక్రటరీ పాండే అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ అయింది. సమావేశ అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. పెద్దవాగు తప్ప ఇంకే ప్రాజెక్టు ఇవ్వం.. జీఆర్ఎంబీ సబ్ కమిటీ మీటింగ్‌లో తెలంగాణ తేల్చేసింది. తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ.. ఏపీలోని వెంకటనగరం లిఫ్ట్ పై సమావేశంలోఈ సమావేశంలో చర్చించారు. 

https://ntvtelugu.com/ap-and-telangana-officials-discussed-water-allocations-at-the-grmb-meeting/

2.2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు నూతన టారిఫ్‌లతో ప్రతిపాదనలు పంపాయని, ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్ (ఎలక్ట్రీసీటీ రెగ్యూలేటరీ కమిషన్‌) జస్టిస్‌ సి.వి నాగర్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీటిపై మూడు రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. 12000 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని డిస్కంలు ప్రతిపాదించాయన్నారు.

https://ntvtelugu.com/nagarjuna-reddy-said-that-the-tariffs-of-the-power-distribution-companies-have-been-received/

3.తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పదేపదే ఆరోపిస్తున్నారని, అందుకే తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

https://ntvtelugu.com/central-minister-kishan-reddy-letter-to-cm-kcr/

4.ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుంచి చర్చలు జరిపేందుకు సిద్ధంగ ఉన్నామని సంప్రదింపుల కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణ రెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. దానిలో భాగంగా వారిని రావల్సిందిగా నిన్న సమాచారం ఇచ్చాం. జీవోలను అభయన్స్‌లో పెట్టాలని కోరారు. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని వారు వెల్లడించారు. అయితే తాము రేపు మరల వారితో చర్చల కోసం వస్తామని మంత్రులు పేర్కొన్నారు.

https://ntvtelugu.com/the-ap-government-has-set-up-a-committee-with-bostha-and-sajjala-to-discuss-with-the-employees/

5.దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు 55 రైళ్లను రద్దు చేసింది. ప్రస్తుతం రద్దు అయిన రైళ్లలో ఎక్కువగా ప్యాసింజర్ రైళ్ల ఉన్నాయి. వీటితో పాటు కొన్ని మెయిల్ ఎక్స్ ప్రెస్ లైన్లు ఉన్నాయి.

https://ntvtelugu.com/south-central-trains-canceled-due-to-covid/

6.వరంగల్ రైతులు కన్నెర్ర చేశారు. వ్యాపారుల మోసంపై ఆగ్రహం వ్యక్తం చేవారు. దీంతో ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఏనుమాముల మార్కెట్లో ఉదయం మిర్చి భారీగా వచ్చింది. దీంతో వ్యాపారులు తేజ మిర్చికి రూ.17,200గా ధర నిర్ణయించారు. అనంతరం రూ.14 వేలలోపు ధరలు నిర్ణయిస్తూ కొనుగోళ్లకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మిర్చి యార్డు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఒక కాంటను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు ప్రాధేయపడగా.. రైతులు శాంతించారు. కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

https://ntvtelugu.com/farmers-protest-in-warangal-enumamula-market/

7. ఏపీకి జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తిచేయాలని, అంచనా వ్యయాన్ని ఆమోదించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రెండున్నర గంటలపాటు కొనసాగిన సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని విజయసాయి రెడ్డి తెలిపారు. గత పర్యటన సందర్బంగా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించాం. 

https://ntvtelugu.com/central-govt-agrees-ap-govt-estimations-on-polavaram-project/

8.ఫిబ్ర‌వ‌రి 1 వ తేదీన కేంద్రం సాధార‌ణ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ది.  అదేరోజున రైల్వే బ‌డ్జెట్‌ను కూడా ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు.  గ‌తేడాది రైల్వే బడ్జెట్ 1,10,055 కోట్లు కాగా, ఈ ఏడాది బ‌డ్జెన్‌ను డ‌బుల్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  రైల్వే బ‌డ్జెట్‌కు సంబంధిత మంత్రిత్వ‌శాఖ తుదిమెరుగుతు దిద్దుతున్న‌ది.   ఇక ఇదిలా ఉంటే, గ‌తేడాది రైల్వే శాఖ‌కు సుమారు 26,338 కోట్ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింది.  క‌రోనా కార‌ణంగా వివిధ రైళ్లు ఆగిపోవ‌డంతో ఈ న‌ష్టం సంభ‌వించింది.  కాగా, ఈ ఏడాది ప్ర‌వేశ‌పెట్ట‌బోయే రైల్వే బ‌డ్జెట్ సుమారు రూ. 2.25 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

https://ntvtelugu.com/railway-budget-will-double-this-year/

9.రోజురోజుకు కరోనా విజృభిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇక ఈ మహమ్మారి వలన చిత్ర పరిశ్రమ కుదేలు అవుతోంది. ఇటీవల థర్డ్ వేవ్ విజృంభిస్తుండడంతో సినిమాలను వాయిదా వేయడం తప్ప మేకర్స్ కి వేరే గత్యంతరం కనిపించడం లేదు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల నుంచి సాధారణ సినిమాల వరకు చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ని మార్చుకున్నాయి. తాజాగా అదే కోవలోకి చేరింది అడవి శేష్ ” మేజర్” శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను సోని పిక్చర్స్, జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ మరియు a+s మూవీస్ పతాకంపై సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

https://ntvtelugu.com/adivi-seshs-major-film-postponed/

10.బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ని వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కొన్ని కమిట్ మెంట్స్ ఉండడం వలన ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లలేదని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కత్రినా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

https://ntvtelugu.com/katrina-kaif-new-photos-viral/
Exit mobile version