1.దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు
2.ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి వస్తుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ముందుగా అనుకున్న విధంగా 11 రెవెన్యూ డివిజన్‌లు కాకుండా అదనంగా మరో ఐదు రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్‌ల సంఖ్య 15కి చేరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికుల నుంచి ఇప్పటి వరకూ 9 వేలకు పైగా విజ్ఞప్తులు రాగా వాటిపై తుది కసరత్తు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
3.సంచలనం కలిగించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకాంశాలు బయటకు వస్తున్నాయి. ఈడీ దాఖలుచేసిన కోర్టీ ధిక్కరణ పిటిషన్ విచారణకు రానుంది. కెల్విన్ కూల్ ప్యాడ్ లో సినీతారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించడంలేదని ఈడీ కోర్టుకి తెలిపింది.
4.పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నేత టి.నందీశ్వర్ గౌడ్. బచ్చుగూడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై ప్రధాన మంత్రికి దొడ్డిదారిన వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించటం సాధ్యమేనా..? తాను ఎంపీపీగా, ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం ఇవ్వడానికి సిద్దం.
5.RRR ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా RRR సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్ బాబు నిన్న రాత్రి తన నివాసంలో కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించినట్టు సమాచారం.
6.వరంగల్ జిల్లా అంటే ఉద్యోమాన్ని మలుపు తిప్పిన జిల్లా అని, కాకతీయుల పాలించిన జిల్లా వరంగల్ జిల్లా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏంతో మంది పాలించిన వరంగల్, అభివృద్ధి లో లేకపోయినా కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారన్నారు. వైద్య రంగంలో మొదటి స్థానంలో వరంగల్ ఉండబోతోందని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఫలితం వల్లనే రామప్పకు యోనిస్కో గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రానికి అభివృద్ధి పనులు చేయనికి చిత్త శుద్ధి లేదని, వరంగల్ ఫోర్ట్ , వేయి స్తంభాల దేవాలయలను యూనిస్కో గుర్తింపు తెస్తామన్నారు.
7.చట్టాలు చేయాల్సిన సభలను భజన సభలుగా ఎలా మారుస్తారు..? అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మండిపడ్డారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు సభ హుందాను దిగజార్చారన్న ఆయన.. 1953-2022 వరకు జరిగిన సమావేశాలలో ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదన్నారు.. ప్రజల సమస్యలు, పరిష్కారంపై చర్చే లేదు.. ఏక పక్షంగా నిర్ణయాలు ఆమోదించుకోవడం, ప్రతిపక్ష సభ్యులను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలా..?
8.సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను చేపట్టారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రకాష్ రాజ్ ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని షాద్ నగర్ వద్ద గల తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరు తమ జీవితంలో గుర్తుండిపోయేలా తమ పుట్టినరోజు, పెళ్లిరోజున మొక్కలు నాటుతూ పర్యావరణానికి మేలు చేస్తున్నారని
9.పాకిస్థాన్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ కాగా బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 227/3 వద్ద డిక్లేర్ చేయగా పాకిస్థాన్ ముందు 351 పరుగుల టార్గెట్ నిలిచింది.
10. కోలీవుడ్ స్టార్ విజయ్ తాజా చిత్రం “బీస్ట్” ఏప్రిల్ 13న థియేటర్లలోకి రానుంది. నెల్సన్ దిల్ప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. గత ఏడాది ‘బీస్ట్’ను ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ నుండి ఇప్పటికే రెండు పాటలను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. “అరబిక్ కుతు” ఇంటర్నెట్ ను షేక్ చేయగా, “జాలీ జింఖానా” సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు విజయ్ అభిమానులు. అయితే ఇప్పటిదాకా తమిళంలోనే విడుదలవుతుందని అనుకున్నారు అంతా. కానీ ఈరోజు తాజా అప్డేట్ తో విజయ్ పాన్ ఇండియా రేసులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వెల్లడించారు మేకర్స్.
