Site icon NTV Telugu

టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో చర్చించారు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని. ఈ నెల 10న సీఎం జగన్ తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల సమావేశం వున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తో సినిమటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

https://ntvtelugu.com/minister-perni-nani-met-cm-jagan-on-cinema-tickets-issue/

2.ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. మళ్లీ తెలంగాణపై మోడీ అక్కసు వెళ్లగక్కారని, తెలంగాణ మీద ఎందుకు అంత వివక్ష.. ఎందుకు అంత కక్ష.. ఎందుకు అంత విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యసభలో మోడీ మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిందని, రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నదని ఆయన అన్నారు. 

https://ntvtelugu.com/minister-harish-rao-fire-on-pm-modi/

3.భూమిపై జీవం ఆవిర్భ‌వించి ఎన్ని కోట్ల సవంత్స‌రాలైంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జీవంలో మార్పులు జరుగుతూనే ఉన్న‌ది. ఏక‌క‌ణ జీవుల నుంచి ఆధునిక మానివుని వ‌ర‌కు ఎన్నో మార్పులు జరిగాయి. అయితే, జీవం పుట్టుక‌కు ప్ర‌ధాన కార‌ణం ఏంటి అనే దానిపై శాస్త్ర‌వేత్త‌లు చాలా కాలంగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. 

https://ntvtelugu.com/scientists-found-lost-super-mountain-larger-than-himalayas/

4.పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. చట్టంలో లేకపోయినా, నమ్మకం కలిగించేలా ప్రధానులు వాఖ్యలు ఉండేవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని, మోడీ మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారని ఆయన అన్నారు. గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీ ది అని ఆయన ఆరోపించారు.

https://ntvtelugu.com/tpcc-chief-revanth-reddy-made-sensational-comments-on-modi/

5.ఉక్రెయిన్‌- ర‌ష్యా మ‌ధ్య ఉద్రిక్తక‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో ర‌ష్యా ద‌ళాల‌ను మోహ‌రించ‌గా, ఉక్రెయిన్‌కు అండ‌గా నాటో ద‌ళాలు, అమెరికా ద‌ళాలు మోహ‌రించాయి. ఉక్రెయిన్ ను అక్ర‌మించుకోవాల‌ని చూస్తే ఊరుకునేది లేద‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. ఉక్రెయిన్‌కు స‌హాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. అయితే, ర‌ష్యాకూడా ఇదే విధంగా చెబున్న‌ది. ఉక్రెయిన్‌ను ఆక్ర‌మించుకోవాల‌నే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని, సోవియ‌ట్ యూనియ‌న్ ఒప్పందాల‌కు విరుద్దంగా నాటో …

https://ntvtelugu.com/ukraine-crisis-macron-hopes-to-historic-solution-to-ukraine-and-russia-issues/

6.ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి అయిన శ్రీసుధతో ఐదేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన విషయం తెల్సిందే. తనకు న్యాయం చేయాలంటూ సుధ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం విదితమే. ఇక ఈ కేసులో శ్యామ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. 

https://ntvtelugu.com/leaving-the-case-actress-sudha-challenge-to-shyam-kay-naidu/

7.2015-16 నుండి తెలంగాణలో పర్యాటక మౌలిక సదుపాయాలు, సౌకర్యాల అభివృద్ధి మరియు ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.309.53 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు రూ.242.19 కోట్లు విడుదలయ్యాయి అని కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం లోక్‌సభలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద కేంద్రం ఎకో అభివృద్ధికి కేటాయించిన రూ.91.62 కోట్లలో రూ.87.04 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.

https://ntvtelugu.com/central-government-gives-242-crores-for-telangana-tourism/

8.చైనా చుట్టుప‌క్క‌ల దేశాల‌పై క‌న్నేసింది. 2025 నాటికి తైవాన్‌ను పూర్తిగా ఆక్ర‌మించుకోవాల‌ని చైనా చూస్తున్న‌ది. దీనికోసం చాలా రోజులుగా పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటు ఇండియాలోని లద్ధాఖ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌పై కూడా చైనా క‌న్నేసి ఆక్ర‌మించుకోవాల‌ని చూస్తున్న‌ది. బోర్డర్ లో అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టేందుకు ఆ దేశం సిద్ద‌మౌతున్న సంగ‌తి తెలిసిందే. అదీ చాల‌ద‌న్న‌ట్టు ఇప్పుడు మ‌రో మిత్ర‌దేశం నేపాల్‌పై కూడా చైనా క‌న్నేసింది.

https://ntvtelugu.com/china-encroaching-along-with-nepal-border/

9.టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి ‘భామాకలాపం’ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 11 న ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇక భామాకలాపం గురించి ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…

https://ntvtelugu.com/priyamani-talking-about-bhamakalapam-anupama/

10.ఆన్‌లైన్ లో ఒక వ‌స్తువును బుక్ చేస్తే మ‌రోక వ‌స్తువు వ‌స్తుంది. చిన్న చిన్న వ‌స్తువులు అయితే స‌రే అనుకోవ‌చ్చు. కానీ, ఖ‌రీదైన వ‌స్తువులు కొనుగోలు చేసిన స‌మ‌యంలో కూడా ఇలానే జ‌రుగుతుంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు కొనుగోలు చేసిన స‌మ‌యంలో కొంద‌రికి ఫోన్ ల‌కు బ‌దులు ఇటుక‌లు, రాళ్లు, సోపులు వ‌స్తుంటాయి. తాజాగా ఇంగ్లాండ్ కు చెందిన ఓ మ‌హిళ ఐఫోన్ 13 ప్రో మొబైల్‌ను కొనుగోలు చేసింది. ఈ మొబైల్ డెలివ‌రీ కోసం అద‌నంగా డ‌బ్బులు కూడా చెల్లించింది.

https://ntvtelugu.com/uk-women-ordered-iphone-13-pro-max-mobile-but-she-gets-soap-bottle-in-parcel/
Exit mobile version