Site icon NTV Telugu

ఎన్టీవీ షార్ట్ న్యూస్

ఉత్తరాది గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇక లేరు. ఆమె వయసు 92 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతతో గత కొన్నాళ్ళుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు లతా మంగేష్కర్. ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది.

ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్​ వర్సిటీల్లో రుసుములపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది జాతీయ వైద్య కమిషన్​. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఫీజుల స్థాయిలో ఉండాలని స్పష్టం చేసింది. మొత్తంమీద సంబంధిత విద్యా సంస్థకు అనుమతించిన సీట్ల సంఖ్యలో గరిష్ఠంగా 50 శాతానికి దీన్ని పరిమితం చేయాలని సూచించింది.

తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున చలి తీవ్రత బాగా పెరిగింది. తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లా అర్లి టి లో 6, ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.బేలాలో 7.7డిగ్రీలు, కొమురం భీం జిల్లా కెరమెరిలో 7.8డిగ్రీలు, వాంకిడిలో 8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.

మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భక్తులు అమ్మవార్లకు డబ్బును కానుకగా సమర్పించడానికి ఈ-హుండీని కూడా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నిర్వహిస్తోంది. ఆదివారం కావడంతో మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది.

ఆంటిగ్వాలోని సర్ విలియమ్​ రిచర్డ్స్​ స్టేడియం వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో యువ భారత్ ఇంగ్లండ్ పై అద్భుతమయిన విజయం సాధించింది. టీం ఇండియా ఐదో సారి వరల్డ్ కప్ సాధించింది . 8 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ చేరింది ఇండియా. 5 సార్లు విజయం సాధించగా మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది.

అండ‌ర్‌-19 ప్ర‌పంచక‌ప్ 2022 ఛాంపియ‌న్‌గా నిలిచిన టీమిండియా యువ ఆటగాళ్ళకు ప్రశంసలు కురుస్తున్నాయి. భార‌త యువ జ‌ట్టును బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషా అభినందించారు. అధ్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో భార‌త విజ‌యంలో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క ఆట‌గాడికి రూ. 40 ల‌క్ష‌లు, సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యుడికి 25 లక్షల బహుమతిని బీసీసీఐ ప్ర‌క‌టించింది.

Exit mobile version