Artist Talent: రావి ఆకుపై ఎన్టీవీ లోగో.. చిత్రకారుడి సృజనాత్మకత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు న్యూస్ ఛానెల్స్ చరిత్రలో ఒక కొత్త శకం ఎన్టీవీ… ప్రతి క్షణం ప్రజాహితం అంటూ.. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఎన్టీవీ న్యూస్ ఛానెల్.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్లుగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. వినూత్నమయిన కార్యక్రమాలతో..రాజీలేని వార్తా కథనాలతో.. నిరంతరం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఎన్టీవీ తన ఠీవిని నిరూపించుకుంది. తెలుగు లోగిళ్లలో ఏ ఇంట చూసినా.. ఏ న్యూస్ వీక్షించాలన్నా.. ఇప్పుడు ఎన్టీవీ.. అంతలా తెలుగు వీక్షకులు ఎన్టీవీతో తమ విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్నారు.
2007 ఆగస్టు 30వ తేదీన ఎన్టీవీ 24 X 7 తెలుగు న్యూస్ ఛానెల్‌ను ప్రారంభించారు.. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరిగారు.. ఆ తర్వాత.. భక్తి టీవీ, వనిత టీవీలతో ప్రజలకు మరింత చేరువయ్యారు.. భక్తికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా చూడాలంటే.. భక్తి టీవీ పెట్టాల్సిందే.. మహిళల్లో మరింత చైతన్య భావాలు కలగాలంటే వనితా టీవీ చూడాల్సిందే అనేలా వాటిని తీర్చిదిద్దారు.. మహిళల కోసం దక్షిణ భారత దేశంలో తొలి చానల్ ప్రారంభించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఇప్పుడు ఎన్టీవీ తెలుగు న్యూస్ చానెల్ నంబర్ వన్‌గా కొనసాగుతోంది.. 15 ఏళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్టీవీ, భక్తిటీవీలకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ చిత్రకారుడు ఎన్టీవీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఎన్టీవీ 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నారాయణఖేడ్ కి చెందిన శివకుమార్ అనే చిత్రకారుడు రావి ఆకుపై శుభాకాంక్షలు తెలియజేశారు. రావి ఆకుపై ఎన్టీవీ లోగో చిత్రీకరించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతని సృజనాత్మకతకు అంతా ఫిదా అవుతున్నారు. ఎన్టీవీపై ఇంత అభిమానం చాటుకున్న శివకుమార్.. రావి ఆకుపై ఎంత అందంగా ఎన్టీవీని తీర్చిదిద్దాడో మీరూ చూడండి.
Read Also: CM KCR Meets LaluPrasad Yadav: లాలూప్రసాద్ యాదవ్ తో కేసీఆర్ భేటీ
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!