CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ముప్పాళ్లలో డాక్టర్ జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తోంది అన్నారు. ఇక, 30 ఏళ్ల క్రితమే మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేశాం.. సెకండ్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అయితే, ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారు.. ఇప్పుడు P4 అనే వినూత్న కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Bhadradri Kothagudem : పోలీసుల ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టు దళ సభ్యులు..
ఇక, త్వరలోనే తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే, ఈ పథకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు ఇస్తామన్నారు. అలాగే, రాజధాని అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలను పూర్తి చేయాలి అని తేల్చి చెప్పారు. ఇక, ప్రజలకు ఇచ్చిన సూపర్-6 హామీలు అమలు చేయాలి.. దేశంలో ఇంత ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ఒక్కటే.. మరొ రాష్ట్రం లేదు అన్నారు. అలాగే, పేదరిక నిర్మూలన జరగాలి.. తలసరి ఆదాయం పెరగాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.