Vasantha Krishna Prasad: భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో కూటమి సర్కార్-వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మధ్య క్రెడిట్ పంచాయితీ తారాస్థాయికి చేరుకుంది.. అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వైసీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని.. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అని చెప్పుకునే స్థాయికి ఆ పార్టీ నాయకులు దిగజారరని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శలు గుప్పించారు.. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం.. మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సూచనలు చేస్తే స్వీకరిస్తామని.. అలా కాకుండా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. మెడికల్ కళాశాలల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. వైసీపీ కోటి సంతకాల పేరుతో కుట్ర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అనవసరమైన రాజకీయాలు చేయకుండా ప్రజల మేలు కోసం పని చేస్తే రాబోయే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రజలు ఆదరిస్తారని, ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రహించాలని సూచించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..
Read Also: Peddi Release Date: తగ్గేదే లే అంటున్న ‘పెద్ది’.. అనుకున్న డేట్‌కే రిలీజ్