NTV Telugu Site icon

Samineni Udaya bhanu: వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు..! రాజీనామాకు సిద్ధమైన మరో కీలక నేత..

Samineni Udaya Bhanu

Samineni Udaya Bhanu

Samineni Udaya bhanu: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌లమీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. నిన్నటికి నిన్నే మాజీ మంత్రి, సీనియర్‌ నేత బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. వైసీపీ రాజీనామా చేసిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారట.. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారట జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను.. ఈ నెల 22వ తేదీన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లారట ఉదయభాను.. రేపు నియోజక వర్గంలో కార్యకర్తలతో సమావేశం కానున్న ఉదయభాను.. తన నిర్ణయాన్ని కార్యకర్తలతో పంచుకుంటారని తెలుస్తోంది.. అయితే, ఆరు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచిన ఉదయభాను.. రెండు సార్లు ప్రభుత్వ విప్‌గా పనిచేశారు..

Read Also: Largest Link Bridge: యాదాద్రి భక్తులకు ఊరట.. ఆలయ సమీపంలో లింక్ ఫ్లైఓవర్ ఏర్పాటు ..

ఏపీలో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు.. ఇలా చాలా మంది వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలో తాజాగాఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్‌ నేత సామినేని ఉదయభాను కూడా చేరిపోయారు.. ఇప్పటికే జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు తయారుచేస్తున్నారని తెలుస్తోంది.. కాపు సామాజివర్గానికి చెందిన సామినేని ఉదయభాను 1999, 2004ల్లో జగ్గయ్యపేట నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. మొత్తం మీద మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Show comments