Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ నిమ్మకూరు వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కృష్ణా జిల్లాలోని స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.. సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తిచేసుకుని… వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన నిమ్మకూరుకు వచ్చారు.. అయితే, బాలయ్యకు గార్డ్ ఆఫ్ హానర్ తో స్వాగతం పలికారు గురుకుల పాఠశాల విద్యార్థులు. తమ అభిమాన నటుడికి మంగళ హారతిలిచ్చారు నిమ్మకూరు ఆడపడుచులు. ఇక, స్వర్గీయ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించిన బాలయ్య.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
పద్మభూషణ్ , దేశంలో మొదటి కళాకారుడుగా బుక్ ఆఫర్ రికార్డ్స్ లో స్థానం పొందడం.. వరుస సినీ విజయాలను.. ప్రజల విజయాలుగా భావిస్తున్నాను అన్నారు నందమూరి బాలకృష్ణ.. పదవులు నాకు ముఖ్యం కాదు… వాటికే నేను అలంకారమన్నది నా భావనగా అభివర్ణించారు.. ఈ విజయాలన్నీ తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నాను అని వెల్లడించారు.. తండ్రైన.. గురువైన… దేవుడైన నాకు అన్ని.. ఎన్టీఆరే.. పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన ఎన్టీఆర్.. దరిదాపులకు చేరాలన్నదే నా తపన.. ఎన్టీఆర్ ఉన్నత స్థితికి రావడానికి.. తల్లి బసవతారకం చేసిన త్యాగాలు, అందించిన సహకారం ఎనలేనిదదన్నారు..
Read Also: GST Council meeting 2025లో కొత్త జీఎస్టీ విధానాలు.. ఆటో రంగానికి భారీ బూస్టప్!
ఇక, హిందూపురం ఎమ్మెల్యేగా… రాయలసీమను నా అడ్డాగా భావిస్తాను అన్నారు బాలయ్య.. దృఢ సంకల్పం ఉంటే భగీరథులు కావచ్చని… రాయలసీమకు నీరు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరూపించారన్నారు.. హిందూపురంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నేడు భౌగోళికంగా ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. సందేశం ఉండాలన్న లక్ష్యంతో ప్రతి సినిమా చేస్తున్నట్టు పేర్కొన్నారు.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ వైద్య సేవలు అందిస్తున్నాం. నా సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకోవాలని నిమ్మకూరు వచ్చాను. ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒకటే అన్నది ఎన్టీఆర్ భావన.. నా ఆలోచన కూడా అదే అన్నారు బాలకృష్ణ..
వరదల వల్ల తెలంగాణలో చాలామంది నష్టపోయారు… అన్నదాతలు విలవిలలాడుతున్నారు. తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరస్పరం సహకరించుకుంటూ అండగా ఉండాలన్నారు బాలకృష్ణ.. అపజయాల్లో ప్రాంతాలకతీతంగా తోడుగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. సోషల్ మీడియా వల్ల ప్రపంచం కుదించుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. సోషల్ మీడియాను మంచికి వాడండి.. వినాశనానికి వద్దు అని సూచించారు.. మంచి ఉద్దేశంతో అఖండ 2 తీశాం… కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా తెరకెక్కించామని.. తన తాజా చిత్రం గురించి వెల్లడించారు నటసింహ నందమూరి బాలకృష్ణ..
