Minister Nimmala Ramanaidu: కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగమం దగ్గర జలహారతి నిర్వహించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య , తదితరులు పాల్గొన్నారు.. పట్టీసీమ ద్వారా ఈ సంవ త్సరం 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి నిమ్మల..
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పెర్రీ ఘాట్ పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మలో కలిసిన పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి జాలాలకు జలహారతి ఇచ్చి పసుపు, కుంకుమతోపాటు చీర, సారెలను విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ రామ్ తాతయ్య, జిల్లా కలెక్టర్ తో కలిసి సమర్పించారు మంత్రి నిమ్మల.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడనీ పేర్కొన్నారు. కృష్ణ – గోదావరి నదులను అనుసంధానం చేసిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబుదని, జగన్ పట్టిసీమను వట్టి సీమ చేస్తే చంద్రబాబు నదులకు జలకల సంతరించేలా చర్యలు చేపట్టారనీ తెలిపారు.
Read Also: HYDRAA: హైడ్రా ఫాతిమా కాలేజీ పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోంది..?
గోదావరి – కృష్ణా నదులు అనుసంధానం వల్ల కృష్ణ డెల్టా దిగువ బాగాన ప్రజలు, రైతులకు అవసరమైన తాగునీరు కష్టాలు తీరాయన్నారు నిమ్మల రామానాయుడు.. రూ.1300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే, 2014-19 లో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణాడెల్టాకు తరలించడం ద్వారా రూ. 50 వేల కోట్ల ఆదాయం వచ్చిందనీ తెలిపారు. 2014-19 లో 5 ఏళ్లలో 263 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు కృష్ణ డెల్టాకు తరలించాం. ఇది శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువనీ చెప్పారు. ఇప్పటివరకు పట్టిసీమ ద్వారా 428 కు పైగా టీఎంసీలను కృష్ణాకు తరలించామని, ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం కంటే ఎక్కువని పేర్కొన్నారు.. నాడు టీడీపీ హయాంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా సాగు నీరందిస్తుంటే, వైసీపీ హయాంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల 450 లిఫ్ట్ లు మరుగున పడ్డాయనీ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్ మేనేజ్మెట్ ద్వారా అన్ని రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగమని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే, జగన్ పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగిందనీ, వెంటిలేటర్ మీద ఉన్న ఆర్ధిక వ్యవస్థ కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ల సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఊపిరి పోస్తున్నారనీ వివరించారు మంత్రి నిమ్మల రామానాయుడు..