Site icon NTV Telugu

Kattaleru Vagu: కట్టలేరు వాగుకు మళ్లీ పోటెత్తిన వరద.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్..!

Kattaleru Vagu

Kattaleru Vagu

Kattaleru Vagu: బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగుకు మరోసారి పోటెత్తింది వరద ప్రవాహం.. గంపలగూడెం మండలం వినగడప – తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు పోటెత్తిన వరదతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. గత రెండు వారాల క్రితం వచ్చిన భారీ వరదలకు గండ్లు పడ్డాయి.. మీటర్ల మేర కోతకు గురైంది తాత్కాలిక రహదారి.. ఇటీవలే రోడ్లు మరమ్మత్తుల అనంతరం రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి.. కానీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రవాహంతో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువున నుంచి వస్తున్న వరదలకు తోడు ఇక్కడ కురుస్తున్న వర్షాలు జతకావడంతో మళ్లీ పోటెత్తుతుంది వరదనీరు.. ఇక, కట్టలేరు వాగు వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. 20 గ్రామాల ప్రజలపై దీని ప్రభావం పడింది.. అత్యవసర సమయంలో నూజివీడు విజయవాడ వెళ్లాలి అంటే… అదనంగా 30 కిలో మీటర్లు తిరిగి తిరువూరు మీదగా వెళాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు, ఎవరు కట్టలేరు వైపు వెళ్లకుండా పీకెట్ ఏర్పాటు చేశారు పోలీస్ అండ్ రెవిన్యూ అధికారులు… ఇక, తిరువూరు నియోజవర్గంలో తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో… వరద ప్రవాహం మరింత పెరుగుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి..

Read Also:

Exit mobile version