NTV Telugu Site icon

Yarlagadda Venkatarao: టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం..

Yarlagadda

Yarlagadda

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. కానూరులోని యార్లగడ్డ గ్రాండియర్ లో భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరిగాయి. గన్నవరం నియోజకవర్గంలోని ఏడు గ్రామాల నుంచి సుమారు నాలుగు వందల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన పలువురు నేతలు మాట్లాడుతూ.. యార్లగడ్డ గెలుపుకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తామని తెలిపారు.

Read Also: Karnataka: బీజేపీ-జేడీఎస్ మధ్య కుదిరిన పొత్తు.. ఎన్నెన్ని సీట్లంటే..!

యార్లగడ్డ గెలుపు కోసం రాత్రింబవళ్లు పనిచేస్తామని పేర్కొన్నారు. యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో గెలిపిస్తే.. తమను అన్ని రకాల ఆదుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈసారి రాష్ట్రంలో చంద్రబాబు గెలుపు, నియోజకవర్గంలో యార్లగడ్డ గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని, గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం శాయశక్తుల శ్రమిస్తానని చెప్పారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పని చేయాలన్నారు. గ్రామ స్థాయిలో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం చేస్తూ.. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని వారికి సూచించారు.

Read Also: Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం కొత్త సాంగ్ వచ్చేసింది.. డీజే కొట్టు మావా