ముందుగా నిర్ణయించిన ప్రకారం.. శుక్రవారం రోజే నామినేటెడ్ పోస్టులు ప్రకటించాల్సి ఉన్నా… అన్నింటినీ బేరీజు వేసుకుని.. సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఇవాళ నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు… పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు కేటాయించారు.. ఇక, మంత్రులు ప్రకటించిన నామినేటెడ్ పోస్టులు వివరాలు ఇలా ఉన్నాయి..
- ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు
- సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
- వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
- గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
- టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్
- హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి
- డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన
- బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి
- బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్
- ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా శైలజ
- ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామారావు
- ఏపీ ఎండీసీ ఛైర్మన్‌గా సమీమ్ అస్లాం
- సుడా ఛైర్‌పర్సన్‌గా కోరాడ ఆశాలత
- ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి
- ఏపీ మారిటైం బోర్డ్ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి
- ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్ బోర్డ్ ఛైర్మన్‌గా గేదెల బంగారమ్మ
- ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్
- ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా షేక్ ఆసిఫ్
- ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్‌గా తాతినేని పద్మావతి
- ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌రావు
- రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు
- నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ
- సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా టి.ప్రభావతి.. ఇక, ఇతర కార్పొరేషన్లకు సంబంధించిన మొత్తం 135 పోస్టులను భర్తీ చేశారు.