NTV Telugu Site icon

Kendriya Vidyalaya: విద్యార్ధులకు షాక్.. ఎంపీ కోటా సీట్ల ఎత్తివేత

Kv1

Kv1

కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోట ఎత్తివేస్తూ నిర్ణయం వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎంపీ కోటా సీట్లు ఉండవని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్ కి ఆదేశాలు అందాయి.

ఈ నిర్ణయంపై ఎంపీలు, విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రీయ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. కేంద్రమంత్రి లెక్కల ప్రకారం గత ఏడేళ్ళలో 12 లక్షలమంది విద్యార్ధులు ప్రవేశాలు పొందారు. గత ఏడేళ్ళలో 1.7 లక్షలమంది కంటే తక్కువమంది ఎప్పుడూ కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందలేదు. ఖర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కేవీల్లో చేర్చేందుకు విద్యార్ధుల తల్లిదంండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రతి విద్యాసంవత్సరంలో నిర్వహించే ప్రవేశాల్లో ప్రతి ఎంపీ 10 మంది విద్యార్ధులను సిఫార్సు చేసే అధికారం ఎంపీలకు వుంటుంది. ఐదే సదరు విద్యార్ధులు సంబంధిత ఎంపీ నియోజకవర్గంలో వుండి వుండాలి. తమ నియోజకవర్గంలో కేవీలు లేనట్టయితే పక్కనే వున్న నియోజకవర్గంలో కేవీలకు సిఫార్సు చేసే అవకాశం కల్పించింది కేంద్రం.

kendriya vidyalaya order 

రాజ్యసభ ఎంపీలకు కూడా సిఫార్సు చేసే అధికారం వుంది. ఎంపీ కోటాను రద్దుచేయాలని వచ్చిన సిఫార్సుల ఆధారంగా కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు ఇవ్వరు. దేశంలో మొత్తం 1245 కేంద్రీయ విద్యాలయాలు వున్నాయి. యూపీలో 104, మధ్యప్రదేశ్‌ లో 95, రాజస్థాన్‌ లో 68 కేంద్రీయ విద్యాలయాలు వున్నాయి. లడఖ్‌ లో మినహా అన్ని చోట్ల కేవీలు వున్నాయి. ఢిల్లీలో 41 కేవీలు వున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.