NTV Telugu Site icon

Anil Kumar Yadav: సభ నిర్వహించి తీరుతా.. ఎవరికీ పోటీగా కాదు..

నెల్లూరులో వైసీపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. రేవు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుచరులను ఆదేశించారు. రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్‌తో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. దీంతో.. నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నట్టు అయ్యింది.. కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య వివాదం ముదురుతోంది.. మంత్రి కాకాణిపై వెనక్కి తగ్గని మాజీ మంత్రి అనిల్.. సభను నిర్వహించి తీరుతామంటున్నారు.. నియోజకవర్గం నుంచి మాత్రమే కార్యకర్తలు హాజరవుతారని.. ఇది ఎవరికీ పోటీ సభ కాదు అన్నారు.. 3 రోజుల ముందే సభకు అనుమతి కోరినట్టు వెల్లడించారు. ఇక, సీఎం జగన్‌కు సైనికుడుగానే ఉంటానని స్పష్టం చేశారు.. సభ వాయిదా వేసుకోవాలని అధిష్టానం కూడా సూచించలేదన్నారు.. ఎవరో కార్యక్రమం పెట్టారని నేను సభ పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్. కాగా, అదే రోజు మంత్రి కాకాణి కోసం కూడా సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Read Also: Prashant Kishor: కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న పీకే..? సోనియా, రాహుల్‌తో భేటీ..