CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ – 2047కు సంబంధించిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం భేటీ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో నీతి ఆయోగ్ కు సంబంధించిన సలహాదారు, డైరెక్టర్లతో పాటు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: Stock market: లాభాలకు మళ్లీ బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ఇక, కేంద్ర సర్కార్ పథకాల అమలు తీరుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ప్రణాళిక రూపొందించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రూపొందించినట్టు సీఎం తెలిపారు.
Read Also: UP Crime: మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మైనర్ బాలికపై జిమ్ ట్రైనర్ అత్యాచారం..
కాగా, వ్యవసాయం, ఆక్వా తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేలా ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రెడీ చేసినట్టు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యంకి ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలైన పేదరిక నిర్మూలన, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజిమెంట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి గ్రోత్ ఇంజన్లతో వృద్ధి రేటు సాధించేలా ఈ ప్రణాళికలు రూపొందాయని వీటిని సమర్ధంగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్టు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.