ఈరోజుల్లో పెళ్లి పేరుతో మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకర్ని కాదు.. ఇద్దర్ని కాదు.. ఏకంగా ముగ్గుర్ని పెళ్ళాడాడు ఆ ప్రబుద్ధుడు. చిత్తూరు జిల్లాలో ముగ్గుర్ని పెళ్ళాడిన నిత్య పెళ్ళికొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్యలు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడు.
ఈ నిత్య పెళ్ళికోడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోట కు చెందిన మంజునాథ్ అంగళ్ళ కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా ఆరేళ్ల కిందట చిక్బల్లాపూర్ కు చెందిన ఆశ ను రెండో వివాహం చేసుకున్నాడు. అది చాలదన్నట్టుగా బెంగుళూరులో ఓ ప్రైవేటు కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దావణగిరి ప్రియాంకను మూడో వివాహం చేసుకున్నాడు. తమని మోసం చేశాడంటూ రెండవ భార్య ఆశ ,మూడవ భార్య ప్రియాంకతో కలిసి పిటిఎం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రజనీ. వీరి ఫిర్యాదుతో మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.