Nimmala Ramanaidu : తుఫాన్ ‘మొంథా’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వరదల ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తతతో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద సుమారు 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే, బుడమేరుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా మంత్రి ఖండించారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పర్యవేక్షించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం తీవ్రమవుతోంది. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో, కింది ప్రాంతాల్లోని లోతట్టు ప్రజలందరినీ అప్రమత్తం చేశామని మంత్రి స్పష్టం చేశారు.
తగు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చామని, కరకట్టల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. బుడమేరుకు సంబంధించి ఎలాంటి వరద ప్రమాదం లేదని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం క్యాచ్‌మెంట్ ఏరియాలో ఎక్కడా కూడా ప్రమాదభరితమైన వర్షపాతం లేదు. అందువల్ల, బుడమేరుకి ఒక శాతం కూడా వరద ప్రమాదం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది అలవాటుగా బుడమేరుపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దని, ఆందోళన చెందవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు విజ్ఞప్తి చేశారు.
Wedding Season: దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు.. ఏకంగా రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం..
