ఏపీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ -2023 దృష్ట్యా పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఇవాళ రాత్రి జాతీయ రహదారులపై, స్థానిక రోడ్లపై నూతన సంవత్సర వేడుకలు అనుమతించబడవని పోలీసులు తెలిపారు. ప్రజా రహదారులు,అన్ని ప్రమాదాలకు గురయ్యే సున్నిత ప్రాంతాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఫైర్ క్రాకర్స్ కాల్చడాన్ని ఖచ్చితంగా నిషేధించారు. మద్యం మత్తులో , సైలెన్సర్లు లేకుండా వాహనాలు నడపరాదు. అలాంటి రైడర్స్ పై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టావు.
Read Also: DGP Mahender Reddy Retirement Parade Live: డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ పరేడ్
మద్యం త్రాగి వాహనాలను నడిపే వారిని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. మద్యం త్రాగి వాహనాలను నడిపిన డ్రైవర్లను కోర్టులో హాజరుపరచడం ద్వారా మెజిస్ట్రేట్ వారు భారీగా ఫైన్ విధించే అవకాశం వుందని జిల్లా పోలీసులు తెలిపారు. బార్‌లను నిర్ణీత సమయంలో మూసివేయాలని, డీజేలు నిషేధించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. రోడ్లపై యువత మద్యం బాటిళ్లు బీర్లు త్రాగుతూ వీధుల్లో నడుస్తూ బైక్స్ పై తిరుగుతూ ఆడవాళ్లపై బాలికలపై టీజింగ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
సైలెన్సర్ లేని బైక్ లను సీజ్ చేస్తామన్నారు. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు వుంటాయన్నారు. స్నేహపూర్వక వాతావరణం లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగం సూచించింది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ విచక్షణ రహితంగా స్పీడ్ గా బైక్ కార్ ఇతర వాహనాలు నడపడం వల్ల ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దన్నారు. న్యూ ఇయర్ పార్టీ ఎవరి జీవితాల్లో, కుటుంబాల్లో విషాదం మిగల్చరాదు అని ఆకాంక్షిస్తున్నామని తూర్పుగోదావరె జిల్లా పోలీసు యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Also: Tirupati New Year Restrictions: తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు