భర్తతో వెళ్లి విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. భర్తను ఏమార్చి ప్రియుడితో కలిసి సాయిప్రియ వెళ్లిపోగా.. తన భార్య సముద్రంలో గల్లంతయ్యిందని భావించిన ఆమె భర్త ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో, పోలీసులు, నేవీ, సముద్రతీరంలో గస్తీ దళం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.. కానీ, పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.. ప్రియుడితో వెళ్లిపోయిన ఆమె.. అతడిని పెళ్లి చేసుకుంది.. ఇక, తన కోసం వెతకవద్దు అంటూ.. మమ్మల్ని వదిలేయండి అంటూ తన పేరెంట్స్‌కు మెసేజ్ పెట్టి ట్విస్ట్ ఇచ్చింది.. ఇక, అంతేకాదు.. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి విశాఖపట్నం పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమైన ఆమె.. తమకు రక్షణ కల్పించాలంటూ మరో ట్విస్ట్.. ఇలా ఎన్నో మలుపు తిరుగుతూ వచ్చిన ఈ కేసులో.. తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. తాజాగా, సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై కేసు నమోదు చేశారు పోలీసులు..
Read Also: Astrology : ఆగస్టు 29, ఆదివారం దినఫలాలు
సాయిప్రియ, రవితేజపై ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్‌గార్డ్, పోలీసుల సమయం వృథా అయ్యిందంటున్నారు పోలీసులు. మరోవైపు, తనకు భర్త ఉండగానే అతడ్ని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు దిగాలనుకున్నారు త్రీటౌన్ పోలీసులు.. అయితే, దీనిపై కోర్టును ఆశ్రయించారు.. ఇక, కోర్టు కూడా అనుమతించడంతో సాయిప్రియ, రవితేజపై తాజాగా కేసు నమోదు చేశారు.. కాగా, విశాఖకు చెందిన సాయిప్రియకు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావుతో పెళ్ జరిగింది.. ఆమె భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా.. సాయిప్రియ వైజాగ్‌లోనే ఉంటూ ఏదో కోర్సు నేర్చుకుంటుంది.. అయితే, గత నెల 25వ తేదీన వారి పెళ్లిరోజు కావడంతో.. శ్రీనివాసరావు విశాఖ వెళ్లారు.. దంపతులు ఇద్దరూ సాయంత్రం ఆర్కే బీచ్‌కు వెళ్లారు.. కానీ, రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె అదృశ్యం కావడం.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు.. అందరూ రంగంలోకి దిగడం.. మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.