శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ఓ పోలీస్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. తెలంగాణలో ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తున్న బొడ్డాపు రమణ రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉద్యోగ నిర్వహణలో ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే బొడ్డపు రమణ చనిపోయాడంటూ కోటబొమ్మాళి మండలం సోమనాధపురంలో నివాసముంటున్న రమణ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది ఆరోపణ మాత్రమే కాదు బలంగా చెబుతున్నామంటున్నారు.
Read Also:Etela Rajender: రాజగోపాల్ రెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది
రమణ సొంత ఊరు వచ్చింపుడల్లా పై అధికారులతో ఒత్తిడులు ఎక్కువగా ఉన్నాయంటూ ఉద్యోగం చేయలేకపోతున్నానంటూ తల్లిదండ్రులు వద్ద, వాళ్ళ అన్నయ్య వదినల వద్ద వాపోయావాడని చెబుతోంది బంధువర్గం. గత పది రోజుల క్రితం కూడా ఇదే ప్రస్తావన తన కుమారుడు చెప్పినట్లు వాపోయింది తల్లి. అతని చావు వెనక ప్రేమవ్యవహారం అంటూ తప్పు త్రోవ పట్టిస్తున్నారంటున్నారు. కేవలం డిపార్ట్మెంట్ లో జూబ్లీహిల్స్ పరిధి సి ఐ వల్లే చనిపోయాడంటూ ఆరోపణ బలంగా చేస్తున్నారు కుటుంబీకులు. తక్షణమే ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కూడా చొరవతీసుకొని తమ కుటుంబానికి న్యాయం జరిపించాలని రమణ తల్లి, వదిన, అక్క, బావ కోరుతున్నారు. మరి రెండు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.
Read Also: Minister KTR Roadshow Live: మంత్రి కేటీఆర్ రోడ్ షో లైవ్