NTV Telugu Site icon

New Traffic Rules In AP: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు!

Ap Vehcil Act

Ap Vehcil Act

New Traffic Rules In AP: ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా ఫైన్స్ వేయనున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.1,000 జరిమానా, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే రూ. 1000 ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో పట్టుబడితే రూ.10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read Also: Zelenskyy: ట్రంప్‌కి షాక్.. జెలెన్స్కీకి యూరప్ నేతల మద్దతు..

అలాగే, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటి కేసులలో 1000 రూపాయల వరకూ జరిమానా విధిమని ఏపీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇక, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.5000 జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసే ఛాన్స్ ఉందన్నారు. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిని గుర్తించి ఫైన్స్ విధిస్తామన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలని అధికారులు కోరుతున్నారు.