NTV Telugu Site icon

Atmakur By Election: ఆత్మకూరు బైపోల్‌.. జిల్లా వ్యాప్తంగా అమల్లోకి మోడల్‌ కోడ్..

Collector Chakradhar Babu

Collector Chakradhar Babu

ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడింది.. దీంతో, కొత్తగా ఏర్పడ్డ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ అఫ్ కాండక్ట్ అమలులోకి వచ్చిందని తెలిపారు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.. ఆత్మకూరు ఉప ఎన్నికపై మీడియాతో మాట్లాడిన ఆయన.. కోడ్ అమలు పర్యవేక్షణకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ గడపగడపకు సహా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన కూడదని స్పష్టం చేశారు.

Read Also: Nandamuri : మహేష్ సినిమాలో నందమూరి హీరో..!

ఇక, ఆత్మకూరు బై పోల్‌లో ఈనెల 30 నుంచి జూన్ 6 వ తేదీ వరకూ నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు కలెక్టర్‌ చక్రధర్‌ బాబు.. జూన్ 9న ఉపసంహరణలు ఉంటాయి, జూన్ 23న పోలింగ్, 26న కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు. పోలింగ్‌కు సరిపడా ఈవీఎంలు సిద్ధం చేశామని.. 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.. ఇక, ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కలెక్టర్‌ చక్రధర్‌ బాబు తెలిపారు. కాగా, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే..