Site icon NTV Telugu

Navjeevan Express Fire Accident: నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు

Navjeevan

Navjeevan

తిరుపతి జిల్లా గూడూరు జంక్షన్ సమీపంలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్ లో కిచెన్ బోగీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు..గూడూరు రైల్వే స్టేషన్లో రైలు ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు రైల్వే అధికారులు.

Read Also: Palestine: గాజాలో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన ట్రైన్..రైల్వే అధికారులు అప్రమత్తతతో తప్పింది ప్రమాదం. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు రైల్వే అధికారులు. గూడూరు రైల్వే స్టేషన్‎లో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు కాసింత అయోమయానికి గురయ్యారు. రైల్వే వర్గాల అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు రిలీఫ్ ఫీలయ్యారు.

రైలును భద్రతా అధికారులు పరిశీలించిన అనంతరం చెన్నైకి వెళ్లేందుకు అనుమతించారు.వెంటనే అప్రమత్తం కావడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన పై విచారణ చేస్తున్నామని చెప్పారు.
Read Also:Vikram-S: నేడు విక్రమ్-ఎస్ రాకెట్ లాంచ్.. తొలి స్వదేశీ ప్రైవేట్ రాకెట్‌గా గుర్తింపు

Exit mobile version