దేశంలో ఫెడరల్ వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తుంది అని మండిపడ్డారు సీపీఐ, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ.. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందన్న ఆయన.. గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం ఈనెల 29న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.. విజయవాడలోని రాజ్ భవన్ దగ్గర పెద్దఎత్తున నిరసన చేపడతామన్న ఆయన.. సీబీఐ, ఈడీ వ్యవస్థలు బ్లాక్ మెయిల్స్ గా మారాయని విమర్శించారు. ఎన్ని తప్పులు చేసినా బీజేపీలో ఉంటే ఎటువంటి ఈడీ దాడులు ఉండవని మండిపడ్డారు.. ఇక, రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందుకులకు గురవుతున్నారు.. ఆర్బీకే సెంటర్లలో రైతులకు సంచులు ఇచ్చే గతి కూడా లేదని ఆరోపించారు.. సీఎం వచ్చే ఎన్నికల్లో 175 సీట్ల కోసమే ఆలోచిస్తున్నాడు.. సీఎం జగన్ గడప గడపకు కాదు.. పొలాలకు వెళ్లాలని సూచించారు రామకృష్ణ.
Read Also: Indian Economy Growth in 2023: వచ్చే ఏడాది మన ఆర్థిక వ్యవస్థ సగటు వృద్ధి అంచనా
ఈ నెల 27, 28 తేదీల్లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్ర రైతుల కోసం పలు తీర్మానాలు చేస్తామని వెల్లడించారు రామకృష్ణ.. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడంలేదని విమర్శించిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకి రావాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే స్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేకపోతున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా వ్యాఖ్యానించారు.. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌కి వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అప్పు ఉందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
