Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
- మహిళలకు 33% రిజర్వేషన్లు.. 2029 నాటికి పూర్తి అమలు
- ‘కార్యకర్తే అధినేత’.. టీడీపీకి కొత్త నినాదం
- వైసీపీ ఏకగ్రీవాలపై లోకేష్ సెటైర్లు
- డీఎస్సీ, కొత్త పెన్షన్లపై కీలక అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్టాత్మక ‘మహానాడు’ ఉత్సవాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ సంస్కరణలు, మహిళా సాధికారత, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది ప్రతినిధులు, కార్యకర్తలు ఈ మహానాడుకు హాజరయ్యారని, ఈసారి డిజిటల్ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించుకున్నామని ఆయన వెల్లడించారు.
మహానాడు వేదికగా మహిళా లోకానికి లోకేష్ ఒక చారిత్రాత్మక భరోసా ఇచ్చారు. “పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలోనే చెప్పాం.. దానికి అనుగుణంగా 2029 ఎన్నికల నాటికి దీనిని పూర్తిగా అమలు చేస్తాం” అని స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీలో సమర్థులైన మహిళా నాయకత్వాన్ని ఇప్పటికే గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఒక సామాన్య స్కూల్ టీచర్‌గా ఉన్న వంగలపూడి అనిత ఈరోజు రాష్ట్రానికి హోంమంత్రి అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశమేనని గుర్తుచేశారు. అనితతో పాటు శిరీష, గల్లా మాధవి వంటి ఎందరో కొత్తవారికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించామన్నారు. ‘కార్యకర్తే అధినేత.. నా తెలుగుదేశం నా బాధ్యత’ అనే నినాదంతోనే ఇకపై అన్ని సమావేశాలు ప్రారంభం కావాలని, కార్యకర్తల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు.
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పూర్తి సిద్ధంగా ఉందని నారా లోకేష్ ప్రకటించారు. గత వైసీపీ పాలనలో నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుని, అక్రమంగా, అరాచకంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ “ఏకగ్రీవాలు జరిగితే ఒప్పుకోను” అనడం చూస్తుంటే.. వారి హయాంలో జరిగినవన్నీ అక్రమ ఏకగ్రీవాలేనని స్వయంగా ఒప్పుకున్నట్లయిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్లే ప్రజలు వారిని 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు. తాము అలాంటి తప్పులు చేయబోమని, ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతోనే పంచాయతీలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
యువతకు, ‘జెన్ జీ’ (Gen Z) తరానికి అవసరమైన సంస్కరణలు, నిర్ణయాలు పార్టీలో నిరంతర ప్రక్రియగా సాగుతుంటాయని లోకేష్ పేర్కొన్నారు. గత మహానాడులో ఆరు సూత్రాలను తీసుకొచ్చామని, ఈసారి మహిళలు, యువత ప్రయోజనాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఇతర పార్టీలు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తాయా లేదా అనేది తమకు అనవసరమని, టీడీపీ పరంగా కింది స్థాయి నుండి కొత్త లీడర్షిప్ను బిల్డప్ చేస్తున్నామన్నారు.
నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం.. కోర్టు కేసులు, ఎన్నో అడ్డంకులు సృష్టించినా వాటన్నింటినీ అధిగమించి కేవలం 150 రోజుల్లోనే పారదర్శకంగా డీఎస్సీ (DSC) ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టామని లోకేష్ వివరించారు. అలాగే అర్హులైన వారికి అందించే కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా జరుగుతోందని, రాబోయే జూన్ నెలలోనే కొత్త పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తామని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!