టీడీపీ సీనియర్ నేతపై హత్యాయత్నం.. నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై శనివారం మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. కోస్గి మండలం పెద్దభూంపల్లిలో రథోత్సవంలో పాల్గొన్న తిక్కారెడ్డిపై దాడి చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Read Also: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై వైసీపీలో చర్చ
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
అయితే టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గతంలోనూ తిక్కారెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నం జరిగినా పోలీసులు భద్రత కల్పించడంలో తీవ్రంగా విఫలమయ్యారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలే తిక్కారెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారని లోకేష్ ఆరోపించారు. తిక్కారెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ అనే కత్తికి జగన్ బలిచేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. కత్తిని నమ్ముకుంటే కత్తికే బలికాక తప్పదని హితవు పలికారు. ప్రజలు గెలిపించింది ప్రతిపక్ష నేతలకు హతమార్చడానికా అంటూ జగన్ ప్రభుత్వాన్ని లోకేష్ సూటిగా ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ కత్తికి బలిస్తున్నారు @ysjagan. ప్రజలు గెలిపించింది ప్రతిపక్ష నేతల్ని హతమార్చడానికా? బాధ్యతాయుతంగా ఉండాల్సిన మీరు ఫ్యాక్షన్ రాజకీయాలను వదులుకోకపోవడం మీలోని మానసిక రుగ్మతని బయటపెడుతుంది.(1/3) pic.twitter.com/1fdaUxPNzq
— Lokesh Nara (@naralokesh) December 11, 2021
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!