NTV Telugu Site icon

టీడీపీ సీనియర్ నేతపై హత్యాయత్నం.. నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం

కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై శనివారం మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. కోస్గి మండలం పెద్దభూంపల్లిలో రథోత్సవంలో పాల్గొన్న తిక్కారెడ్డిపై దాడి చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Read Also: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై వైసీపీలో చర్చ

అయితే టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గతంలోనూ తిక్కారెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నం జరిగినా పోలీసులు భద్రత కల్పించడంలో తీవ్రంగా విఫలమయ్యారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలే తిక్కారెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారని లోకేష్ ఆరోపించారు. తిక్కారెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ అనే కత్తికి జగన్ బలిచేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. కత్తిని నమ్ముకుంటే కత్తికే బలికాక తప్పదని హితవు పలికారు. ప్రజలు గెలిపించింది ప్రతిపక్ష నేతలకు హతమార్చడానికా అంటూ జగన్ ప్రభుత్వాన్ని లోకేష్ సూటిగా ప్రశ్నించారు.