Site icon NTV Telugu

Nara Lokesh: బీహార్‌ని మించిపోతున్న ఏపీ

ఏపీలో ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. ఇలాంటి ఘటనలతో బీహారును ఏపీ మించిపోయింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.ఇవాళ ఓ వలసకూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగింది. బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఏంచేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు లోకేష్.

గత నాలుగు రోజులుగా గుంటూరు జిల్లాలో రోజుకో రేప్ జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిపక్షంపై ఎదురుదాడి మాని మహిళలపై నేరాలను అదుపుచేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మహిళలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లే భయానక పరిస్థితులు తలెత్తవచ్చని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలి.హోం మంత్రి తానేటి వనిత ఒక మహిళ అయి ఉండి మహిళల తప్పిదాల వల్లే రేప్ లు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడటం దురదృష్టకరం.పెంపకంలో తల్లుల తప్పుల వలనే ఘోరాలు జరుగుతున్నాయని కించపరుస్తూ మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం స్వయంగా హోం మంత్రి చేయడం బాధాకరం అన్నారు లోకేష్.

Chandrababu Naidu: చంద్రబాబు మే డే శుభాకాంక్షలు 

 

Exit mobile version