త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తా : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో.. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలి. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలి. పసి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందించి ఆకలి తీర్చండి అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ,ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడంలో టీడీపీ ఎప్పుడూ ముందు ఉంటుంది అని చెప్పారు. వరద బాధిత ప్రజలకు ప్రభుత్వం కంటే ముందే సేవలు అందించేందుకు రంగంలోకి దిగింది. ఎన్టీఆర్ ట్రస్టుతో సమన్వయం చేసుకుని టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. త్వరలోనే నేను కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు చంద్రబాబు.

Related Articles

Latest Articles