ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ సారి లేఖలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్ని ప్రస్తావించారు.. పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని లేఖలో కోరిన ఆయన.. అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని కోరిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించి రూ. 10 లక్షల ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేశారు.
Read Also: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్.. సెల్ఫీ వీడియోతో సంచలనం..!
ఇక, 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని తన లేఖలో సీఎం జగన్‌ను కోరారు నారా లోకేష్.. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేసిన ఆయన.. నిర్వాసితులకు కేటాయించిన కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.. గ్రామాలను ఖాళీ చేయించిన తేదీనే కటాఫ్ తేదీగా పరిగణించాలని సూచించారు. కాగా, ఈ మధ్య రాజకీయం పోలవరం చుట్టూ తిరుగుతోన్న విషయం తెలిసిందే.. ఓవైపు బీజేపీ, మరోవైపు జనసేన, టీడీపీ ఇలా.. అంతా పోలవరం ప్రాజెక్టుపైనే మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతలైతే.. ఏపీ ప్రభుత్వాన్ని చేతకపోతే ప్రాజెక్టు నిర్మాణం నుంచి తప్పుకోవాలి.. కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.